జై భారత్ వాయిస్ గీసుకొండ
గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుల లో సేంద్రియ ఎరువును తయారు చేసుకొని వాటిద్వారా ఆదాయాన్ని పొంది గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని వరంగల్ జిల్లా డి అర్ డి ఓ యం.సంపత్ రావు అన్నారు.
గీసుకొండ మండలములోని మచ్చా పూర్ గ్రామ పంచాయతీ నర్సరీ,డంపింగ్ యార్డ్,పల్లె పకృతి వనం,గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న పలు రికార్డులను గురువారం ఆయన పరిశీలించారు.గ్రామ పంచాయితీ రికార్డులు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు.ఈ కార్యక్రమములో ఎంపిఓ అడేపు ప్రభాకర్, సర్పంచ్ బొడకుంట్ల ప్రకాష్,పంచాయితీ కార్యదర్శి శారద, ఉన్నారు.