Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

గిరిజన సాంస్కృతిక వైభవానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుంది.


జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
  కాకతీయ విశ్వవిద్యాలయంలో తీజ్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి  పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని  మాట్లాడుతూ… గిరిజనులందరికి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సాంస్కృతిక వైభవానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు.గిరిజన మహిళలు ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండగ తీజ్,అని భక్తి శ్రద్ధలతో జరుపుకోవలన్నారు.ప్రకృతిని ఆరాధిస్తూ గొప్పగా పూజించే గిరిజన సాంస్కృతిక పండగ తీజ్ ఉత్సవాల్లో పాల్గొనటం సంతోషంగా ఉంది. ప్రకృతి తమను చల్లగా చూడాలని కోరుకున్నారు.పూలను, ప్రకృతి ని ఆరాధిస్తూ పండుగలు జరుపుకోవటం మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా మారిందన్నారు.ఈ వేడుకల్లో మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీర సీతారాం నాయక్  ప్రొఫెసర్ సురేష్ లాల్ గారు డా. జి రాజు నాయక్ , అశ్విన్ రాథోడ్ యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రెటరీ, వినోద్ లోక్ నాయక్ యూత్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, మాలోత్ రమేష్ నాయక్ గారు, యూనివర్సిటీ విద్యార్థి నాయకులు వెంకట్ నాయక్, రమేష్ నాయక్, అశోక్, తిరుపతి, ఆలోజి, స్నేహ,నవ్య సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సాయి బాబా ఆలయంలో ఉత్స వాలు

Jaibharath News

శ్రీలక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు

Jaibharath News

సీజనల్ వ్యాధుల చికిత్సలో ప్రైవేట్ ఆస్పత్రులు బాధ్యతగా వ్యవహరించాలి