(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):
ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ళ గ్రామంలో విశ్వ కర్మ జయంతిని బుధవారం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సలేంద్ర వినోదాచార్య ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. తొలుత విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు భక్తులు విశ్వకర్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత యజ్ఞ హోమాదులు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా విశ్వకర్మ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు పోనుగోటి రాజపాపయ్య, ఉపాధ్యక్షులు ఉప్పునూతల అన్నమాచారి, కోశాధికారి పోనుగోటి శ్రీనివాస్, సంఘ సభ్యులు పొనుగోటి సత్యనారాయణ, ఉప్పునూతల కోటిలింగాచారి ,పొనుగోటి రాజేశ్వర చారి ,ఉప్పునూతల బ్రహ్మచారి,కార్యవర్గ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

previous post