Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

రాష్ట్రంలో రాబోయేది.. బీజేపీ ప్రభుత్వం

(జై భారత్ వాయిస్ దామెర )
రాష్ట్రంలో రాబోయేది.. బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దామెర మండలం పులుకుర్తి గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ పెరుక సత్యం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలనకు బీజేపీ ప్రభుత్వమే రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. కేవలం బీజేపీ పార్టీ హయాంలోనే అభివృద్ధి సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ దామెర మండల అధ్యక్షుడు జంగిలి నాగరాజు, ప్రధాన కార్యదర్శి గన్ను సతీష్, ఓబీసీ మండల అధ్యక్షుడు పెంచాల జగన్, యువ మోర్చా జిల్లా కోశాధికారి సూర చందర్, శ్రీనాథ్, దుబాసి నాగరాజు, పెరుక వేణు, బూతం రాజు, దండు వినోద్, ఈదునూరి రాకేష్, ఈదునూరి మహెష్, ఈద నూరి పవన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

కిట్స్ లో ఓపెన్ డే స్కూల్ ప్రోగ్రాం ఫర్ హై స్కూల్ టీచర్స్ అండ్ చిల్డ్రన్

దామెర ఎస్సైగా అశోక్

Jaibharath News

పదవ తారీకులోపు మొదటి దశలో మంజూరైన రుణమాఫీ నిధులను రైతులకు అందజేయాలి