—
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు ):ప్లాస్టిక్ నుంచి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని లయన్స్ క్లబ్ ఆత్మకూరు శాఖ అధ్యక్షులు శ్రీ ఏరుకొండ రవీందర్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఎంపీపీఎస్ ఆత్మకూర్ గొల్లవాడ పాఠశాలలో ప్లాస్టిక్ ను వాడడం వల్ల కలిగే అనర్ధాల గురించి విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆత్మకూర్ శాఖ ఆధ్వర్యంలో “పర్యావరణం పరిరక్షణ –అందరి బాధ్యత” అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ గౌడ్ మాట్లాడుతూ నిత్యజీవితంలో ప్లాస్టిక్ వాడడం వల్ల మనుషులు, జంతువులు రోగాల బారిన పడుతున్నారని, ప్లాస్టిక్ వల్ల నీరు కూడా కలుషితం అవుతుందని దానివల్ల రోగాలు తొందరగా వ్యాపిస్తాయని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కాగితం సంచులు, జనపనారతో చేసిన సంచులు వాడాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు చేతి సంచులు పంపిణీ చేశారు. అనంతరం హనుమకొండ జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ చంద్రశేఖర్ ఆర్య జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు రసాయనాలు వాడని పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెండెం రాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ టింగిల్ కార్ సత్యనారాయణ ,లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నాగ బండి శివప్రసాద్, ఉపాధ్యక్షులు పాపని రవీందర్ , లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు రేవూరి దేవేందర్ రెడ్డి ,కోశాధికారి బాదం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
