Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నిరాదరణ కలిగిన బాలలకు విద్య అందించుట అందరి లక్ష్యo వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్

నిరాదరణ కలిగిన బాలలకు విద్య అందించుట అందరి లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.వరంగల్లోని ఎనుమాముల ఎన్టీఆర్ నగర్ నందు మండల ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ఇతర రాష్ట్రాల నుంచి వరంగల్ కు వలస వచ్చి తల్లిదండ్రులతోపాటు విద్యా వసతులు లేకుండా ఉండి ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా గుర్తించిన బాలలకు ఈరోజు ఎడ్యుకేషనల్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బద్రి నాయక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఆంటీ హ్యూమన్ ట్రాఫిక్కింగ్ యూనిట్ వరంగల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమంలో భాగంగా పోలీసు మరియు ఇతర శాఖల సహకారంతో బడి బయట ఉన్న పిల్లల్ని, బాల కార్మికులు మరియు నిరాదరణ కలిగిన పిల్లల్ని గుర్తించడం మరియు రెస్క్యూ చేయడం జరిగింది అనంతరం వారి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని తెలిపారు అయితే పూర్తిస్థాయి పునరావాసం పిల్లలకు జరగాలంటే వారికి విద్య అందించడమే ప్రాథమిక లక్ష్యం అని దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క పాఠశాలలో బీహార్ మరియు ఒరిస్సా ప్రాంతం నుంచి వచ్చిన సుమారు 62 మంది పిల్లల్ని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో అడ్మిట్ చేసి వారికి కావలసిన పూర్తి సహకారాలను అందించడం జరుగుతుంది తెలిపారు.ఈ సందర్భంగా హాజరైన బాలలతోటి మాట్లాడుతూ జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలని దాన్ని సాధించడానికి చదువు అనేది ముఖ్య భూమిక పోషిస్తుందని తెలిపారు పిల్లలందరూ ఒక లక్ష్యం తో చదువుకోవాలని సూచించారు. అదేవిధంగా పిల్లల్ని ఎవరైనా తల్లిదండ్రులు గాని ,వ్యాపారస్తులు గాని పనిలో పెట్టినట్టయితే చట్టరీత్యా వారి పైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు .ఈ యొక్క కార్యక్రమంలో వరంగల్ ఈస్టు జోన్ డిప్యూటీ కమిషనర్ పోలీస్ శ్రీ అంకిత్ కుమార్ హాజరై మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటువంటి చొరవ తీసుకోవడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రథమం అని దీని కొనసాగింపుగా ఇతర వర్క్ సైట్లల్లో కూడా పిల్లలకందరికీ చదువుకునే లాగున పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని దీనికి దిశగా ప్రయత్నం చేస్తామని తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో సాంఘిక సేవా సంస్థ వరంగల్ సహాయంతో పిల్లలకు ఉచితంగా బ్యాగులు పుస్తకాలు మరియు ఇతర సామాగ్రిని అందజేయడం జరిగింది మరియు ఈ వలస వచ్చిన బాలుల కొరకు ప్రత్యేకంగా డాన్ బాస్కో సహకారంతో ఇద్దరు టీచర్లను ఏర్పాటు చేశారు వారికి చదువు నేర్పించడం జరుగుతుందని తెలిపారు.ఈ యొక్క కార్యక్రమం నందు మామునుర్ ఏసీపీ శ్రీ వెంకటేష్ ,ఏనుమాముల ఎస్హెచ్ఓ సురేష్ కుమార్, ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్స్పెక్టర్ జె శ్యాంసుందర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ వి వసుధ ,ఎఫ్ఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ, డాన్ బాస్కో ఎన్జీవో ఫాదర్ కోసి ,సంస్థ కోఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ ,ఎం అజయ్ కుమార్ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ సిబ్బంది ఎస్ ఐ సుధాకర్, శ్రీనివాస్ ,రామారావు, భాగ్యలక్ష్మి సమయుద్దిన్, పాషా మరియు ఏనుమాముల పి స్ ఎస్ ఐ లు రాజు, రాజు, సిబ్బంది, తదితరులతోపాటు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవాలు ప్రారంభం

తెలంగాణలో యూరియా కొరత కేంద్ర ప్రభుత్వ వివక్షమే రైతులకు సరిపడా ఎరువులను అందించాలి

గొర్రెకుంట ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి నమిండ్ల సాధన్ ఆర్ ఓ మిని వాటర్ ప్లాంట్ బహుకరణ