ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలు: విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించిన బీజేపీ హనుమకొండ జిల్లా మహిళా మోర్చా.భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “సేవ పక్వాడ – 2025” కార్యక్రమంలో భాగంగా, బీజేపీ హనుమకొండ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి రత్నా లక్ష్మీ గారి ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు చిత్రలేఖనం మరియు వ్యాసరచన పోటీలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రావు పద్మరెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవితం యువతరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన అడుగుజాడలలో నడుస్తూ విద్యార్థులు దేశ నిర్మాతలుగా ఎదగాలని ఆకాంక్షించారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రధాని జన్మదినాన్ని జరుపుకోవడం అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమాన్ని బీజేపీ హనుమకొండ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రత్నా లక్ష్మీ పర్యవేక్షించారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు, వారిలో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి హనుమకొండ జిల్లా నాయకులు కందగట్ల సత్యనారాయణ, ఉష రెడ్డి, గొర్రె ఓం ప్రకాష్, శ్రీరాం రెడ్డి, తదితర నాయకులు , కార్యకర్తలు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
