April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
జాతీయ వార్తలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో అమెరికా న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి. మర్ఫీ ఢిల్లీలో సమావేశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో అమెరికా న్యూజెర్సీ గవర్నర్ శ్రీ ఫిలిప్ డి. మర్ఫీ ఢిల్లీలో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చలు జరిపారు. విద్య, గ్రీన్ ఎనర్జీ, వినోద పరిశ్రమ (ప్రత్యేకంగా సినిమా రంగం), మౌలిక సదుపాయాల అభివృద్ధి (మెట్రో, పట్టణ రవాణా) మరియు మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ వంటి కీలక అంశాలు చర్చలో ప్రస్తావనకు వచ్చాయి.తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలను ముఖ్యమంత్రి గారు వివరించారు. ఐటీ, ఫార్మా రంగాలు సహా రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాత్మక ప్రాధాన్యతలను పేర్కొన్నారు. ఈ సమావేశంలో న్యూజెర్సీ ప్రథమ మహిళ శ్రీమతి టామీ మర్ఫీ గారితో పాటు న్యూజెర్సీ రాష్ట్ర ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

జూన్ 14 తర్వాత కూడా పాత ఆధార్ పనిచేస్తుంది’

ధర్మారెడ్డి గెలుపు కోసం అరుణాచలంలో ప్రత్యేక పూజలు

Jaibharath News

జియో ఎర్టెల్ వొడ ఫోన్ వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వైపు