గంగమ్మ చెంతకు చేరిన బొడ్డెమ్మ-నిద్రపోబోడ్డెమ్మ నిదురపోవమ్మ..కోలాట భజనలతో విధుల్లో ఊరిగింపు….(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు )ఆత్మకూరు మండల కేంద్రం లో బొడ్డెమ్మ నిమజ్జనం కోలాటాల మధ్యన ఘనంగా నిర్వహించారు.తెలంగాణ లో బతుకమ్మ పండుగకు ముందు తొమ్మిది రోజులు ఆడుకుంటారు. బొడ్డెమ్మ బొడ్డెమ్మ బిడ్డలెందరు. అంటు పెళ్లికానీ ఆడపడుచులు, పిల్లలనుండి మొదలై పెద్దలు, ఆడపడుచులు తొమ్మిది రోజులు అడిపడి తొమ్మిదవరోజు న గంగమ్మ చెంతకు చేరావేస్తారు. హనుమకొండ జిల్లా లోని ఆత్మకూరు మండల కేంద్రం లోని పంచాకుట శివాలయం వద్ద తొమ్మిది రోజులు తీరొక్క పువ్వలతో తీర్చి దిద్ది బొడ్డెమ్మ పండుగను వైభవంగా నిర్వహించారు.పిల్లిపిసరకాయ పిటాపిటా అల్లం కొమ్ములు జోజోటా అక్కల గౌరే సందప్ప అలికి జోలపడంగా లేలే బొడ్డెమ్మ రెండే అడుగుళ్ళు బొడ్డెమ్మ ను నిదురబుచ్చినిదుర పో బొడ్డెమ్మ అంటు యూవతులు, మహిళలు, కోలాటం,, భజనాలు చేస్తూ గంగమ్మ చెంతకు బొడ్డమ్మను చేరావేశారు.

