(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో విశేష ప్రతిభ కనబరుస్తున్న తెలంగాణ క్రీడాకారిణి గుగులోతు సౌమ్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఇటీవల అఖిల భారత పుట్‌బాల్ సమాఖ్య నుంచి ఉత్తమ క్రీడాకారిణి అవార్డు అందుకున్న సౌమ్య ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు.ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి , తెలంగాణ క్రీడా ప్రాథికార సంస్థ చైర్మన్ శివసేనా రెడ్డితో పాటు అధికారులు, తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మహమ్మద్ అలీ రఫాత్ , ప్రధాన కార్యదర్శి పాల్గుణ తదితరులు పాల్గొన్నారు

previous post