(జై భారత్ వాయిస్ న్యూస్ మేడారం)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం వన దేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు వారికి ఆశీర్వచనం అందించారు. అంతకుముందు శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు ముఖ్యమంత్రి నిలువెత్తు (68 కిలోలు) బంగారం సమర్పించుకున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి వెంట మంత్రులు కొండా సురేఖ,పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి ,గిరిజన ప్రాంత ఎంపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు



