జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)
భారతీయ జనతా పార్టీ ఆత్మకూరు మండల శాఖ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మండల అధ్యక్షులు ఉప్పుగళ్ళ శ్రీకాంత్ రెడ్డి దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినహన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జనసంఘ వ్యవస్థాపకులలో ఒకరిగా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాన్ని ఏకాత్మత మానవతావాదం ప్రపంచానికి తెలిసిన వ్యక్తి దీన్ దయాల్ ఉపాధ్యాయ అని అన్నారు సమాజంలో అసమానతలు రూపుమాపడానికి అంత్యోదయ అనే ఆయుధాన్ని ప్రవచించిన నవభారత రూపశిల్పి అని కొనియాడారు.అంత్యోదయ అనగా చిట్ట చివరి పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం ఈ అంత్యోదయ విధానాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుందని తెలిపారు
సాధారణ జీవితం గొప్పగా ఆలోచించడం అనేదానికి ప్రత్యక్షంగా జీవించిన మానవతామూర్తి దీన్ దయాల్ ఉపాధ్యాయ అని ఆ మహనీయుని జయంతిని స్మరించుకుంటూ ఆయన ఆశయాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ గౌడ్ మండల అధ్యక్షులు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం, కిసాన్ మోర్చా నియోజకవర్గం కోకన్వీనర్ వంగాల బుచ్చిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు పీసాల సాంబయ్య, బూత్ అధ్యక్షులు బూర దశరథం, కుక్కల కుమారస్వామి, బయ్య శ్రీనివాస్, భయ్యా బిక్షపతి, గుండెబోయిన రఘుపతి, టెంకురాల రామారావు, పెరుమాండ్ల కోర్నేలు, బరుపట్ల శ్రీశైలం, కోగిల కొమరయ్య, కుక్కల రమేష్, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

previous post