Jaibharathvoice.com | Telugu News App In Telangana
మహబూబ్ నగర్ జిల్లా

ఆదివాసీ ఎరుకల సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ మహబూబ్ నగర్
ఆదివాసీ ఎరుకల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్ కళాభవన్ లో ఆత్మ గౌరవ పోరాట జెండా పండుగ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఏకలవ్యుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, ఎరుకల ఆత్మ గౌరవ పోరాట జెండాను ఆవిష్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలకు మంచి భవిష్యత్తు కావంటే వారికి మంచి చదువును అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అలాగే ప్రతి ఒక్కరు ఏదైనా స్కిల్స్ లో నైపుణ్యం కలిగి ఉండాలని ఆయన సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా స్కిల్స్ కలిగిన మ్యాన్ పవర్ కొరత ఉందని, కాబట్టి మనం స్కిల్స్ లో ప్రావిణ్యం సంపాదిస్తే భవిష్యత్తు మనదే అని ఆయన స్పష్టం చేశారు. పదవులు శాశ్వతం కాదని, చదువే శాశ్వతమని ఆయన చెప్పారు. మన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని, అక్కడ సుశిక్షితులైన అధ్యాపకులు ఉన్నారని మన పిల్లల భవిష్యత్తుకు వారు బలమైన పునాది వేస్తారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చదువు పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో లాల్ కోట శ్రీనివాసులు, ఎల్సరి బాలరాజు, పర్తిపూర్ శ్రీనివాసులు,గొల్లపల్లి రాములు, లక్ష్మమ్మ, రమేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.