(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు);
సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంధా) వరంగల్ డివిజన్ కార్యదర్శి బొట్ల రాకేష్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం మాస్ లైన్ పార్టీకి, విప్లవోద్యమానికి తీరని లోటని సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు చిన్న చంద్రన్న, గడ్డం సదానందం,ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు.
ఆదివారం ఆత్మకూరు మండలం గూడెప్పాడు గ్రామంలో కామ్రేడ్ బొట్ల రాకేష్ భౌతిక కాయం పై ఎర్రజెండా కప్పి నివాళులు అర్పించారు. అనంతరం సంతాప సభ మాస్ లైన్ వరంగల్ డివిజన్ సహాయ కార్యదర్శి అర్షం అశోక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొట్ల రాకేష్ విద్యార్థి దశను ఉండే విప్లవోద్యమంలో భాగస్వామ్యం అయ్యాడని, ములుగు, భూపాలపల్లి, ఆత్మకూరు, వరంగల్ ప్రాంతాల్లోని ప్రజల్లో విప్లవ చైతన్యాన్ని రగిలించాడని అన్నారు. విప్లవోద్యమం లో 12 సంవత్సరాలు అజ్ఞాత జీవితం కొనసాగిస్తుండగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి అనేక చిత్రహింసలను పెట్టినా విప్లవోద్యమాన్ని వీడకుండా చివరి వరకు ప్రజల కోసమే పనిచేసిన కామ్రేడ్ బొట్ల రాకేష్ అని అన్నారు. దేశంలో ప్రస్తుత నిర్దిష్ట పరిస్థితులకు మాస్ లైన్ పార్టీ రాజకీయాలే విప్లవోద్యమ అభివృద్ధికి తోడ్పడతాయని విశ్వసించి మాస్ లైన్ పార్టీలో కొనసాగాడని తెలిపారు. ప్రస్తుతం దేశంలో కుల మతోన్మాద ఫాసిస్ట్ విధానాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలను సంఘటితం చేసి సమ సమాజ స్థాపన కోసం విప్లవ పోరాటాలను ఉదృతం చేయాల్సిన తరుణంలో కామ్రేడ్ బొట్ల రాకేష్ మరణ విప్లవోధ్యమానికి పూడ్చలేని లోటు అని వారు తెలిపారు. కామ్రేడ్ బొట్ల రాకేష్ మరణాన్ని చింతిస్తూ వివిధ విప్లవ పార్టీ నాయకులు, విప్లవ సానుభూతిపరులు, ప్రజాస్వామికవాదులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాకేష్ భౌతిక కాయానికి ఘనంగా నివాళులర్పించారు. బొట్ల రాకేష్ అంతిమయాత్రలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు చిర్ర సూరి,PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నర్సింహరావు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నర్సంపేట డివిజన్ కార్యదర్శి అడ్డూరి రాజు, PDSU వరంగల్ జిల్లా అధ్యక్షులు అలవాల నరేష్, వరంగల్ డివిజన్ నాయకులు మైదం పాణి, రమేష్, కత్తుల కొమరయ్య, ధార లింగన్న, సాబిరికానీ మోహన్, అర్షం సుధాకర్,విజేందర్,చిలువేరు ప్రతాప్ , ఆటో యూనియన్ నాయకులు అయోధ్య,ఉద్యమ సహచారులు ,విప్లవాభిమానులు,ప్రజాస్వామికవాదులు పాల్గొన్నారు.
