జై భారత్ వాయిస్ న్యూస్ భూపాలపల్లి)
భూపాలపల్లి మండలం భగత్ సింగ్ నగర్ బస్తి స్వయం సేవకుల ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా విగ్నేశ్వర్ మాట్లాడుతూ దేశంలో చాలామంది ప్రజలు నా కుటుంబం నాఆస్తి అనేదానికి పరిమితమైపోయారు మనము మన దేశము మన సంస్కృతి అనే భావన పెంపొందించుకోవాలన్నారు, స్వాతంత్ర్యం కోసం అనేకమంది అనేక రకాల సంస్థలను వ్యక్తిగతంగా ఉద్యమాలు చేసి స్వాతంత్రం కోసం బలిదానమయ్యారు స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రాన్ని నిలబెట్టుకుని దేశం గురించి ఆలోచించేటువంటి వ్యక్తుల బృందాన్ని తయారు చేయాలని ఉద్దేశంతో నాగపూర్ కేంద్రంగా డాక్టర్ కేశవ్ బలిరాంపంత్ హెడ్గేవర్ గారు 1925వ సంవత్సరం సంఘాన్ని ప్రారంభించారు అప్పటినుంచి ఈ సంవత్సరం వరకు సంఘానికి 100 సంవత్సరాలు వచ్చాయి సంఘం అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రపంచంలో గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థగా ముందుకు కొనసాగుతున్నది.
ఈ ధర్మకార్యంలో కొత్త వాళ్లను సంఘానికి జోడిస్తూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నగర కార్యవాహా సాయిని భాస్కర్ కన్నం యుగదీశ్వర్ గారు, భాగవతం బిక్షపతి , యాదగిరి , ఓరుగంటి భగవాన్ ఉనుకొండ రామకృష్ణ ఇతర స్వయంసేవకులు పాల్గొన్నారు.
