(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):దేశ రక్షణలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుండాలని కుటుంబ ప్రబోధన్ విభాగ్ సంయోజక్ లక్ష్మణ సుధాకర్ అన్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలోనీ పురవీధులలో ఆదివారం ఆర్ఎస్ఎస్ ఆత్మకూరు ఖండ పథ సంచలన్ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వయం సేవకులకు గ్రామంలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లక్ష్మణ సుధాకర్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ స్థాపన జరిగి 100 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నామని ఈ ఉత్సవాలు భాగంగా పథ సంచలన్ నిర్వహించుకోవడం సంతోషదాయకం అన్నారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ సంఘం చెప్పిన విధంగా సామాజిక సామస్యర తను పాటించాలని అలాగే పౌర విధులను బాధ్యతగా అనుసరించాలని అన్నారు. భారతీయ కుటుంబ విలువలు గొప్పవని ప్రతి ఒక్కరూ కుటుంబ విలువలను కాపాడాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి చోట మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజ సంఘటితం కోసం ప్రతి గ్రామంలో ఆర్ ఎస్ ఎస్ శాఖ ను నడపాలని అన్నారు. శాఖ ను నడపడం ద్వారానే అనుకున్న లక్ష్యాన్ని చేరుతామని అన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఖండ కార్యవాహ కందకట్ల విజయ్ కుమార్, జిల్లా సహకార్యవాహ ఉప్పునూతుల శంకర్, చంద్రమౌళి, అంశాలు, శ్రావణ్, రాజేష్, ప్రదీప్, రాజు, వంగాళ బుచ్చిరెడ్డి, సత్యనారాయణ, శివ ప్రసాద్ , వెలి ది కపిల్, రంజిత్ ,సాయి సేన్ తదితరులు పాల్గొన్నారు.

