(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)మెగా టెక్స్ టైల్స్ పనులు వేగవంతం చేయాలి..జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులకు సూచించారు.వరంగల్ జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద , డి ఎఫ్ ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, డిఆర్ఓ విజయలక్ష్మి పాల్గొని కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ లో గ్రీన్ కవరింగ్, ఆర్ ఓ బి పనులు, కూడా లేఅవుట్, డ్రౌనేజీ,ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ తదితర పనుల పురోగతి పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ మాస్టర్ ప్లాన్ ఆమోదించి అత్యాధునిక సదుపాయాలతో పార్కును అభివృద్ధి చేయుటకు ప్రణాళిక బద్దంగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు , కాంట్రాక్టర్లను ఆదేశించడం జరిగిందని అన్నారు.రోడ్ల, ఇందిరమ్మ ఇల్లు
నిర్మాణం,మౌలిక సదుపాయాల అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, హౌసింగ్ లేఅవుట్, స్కూల్ బిల్డింగ్స్, గ్రామపంచాయతీ, వెటర్నరీ ఆసుపత్రి, పబ్లిక్ హెల్త్ సెంటర్,వాటర్ సప్లై,పవర్ సప్లయ్,
పనులు వేగవంతంగా చేసి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో 12 వేల ప్లాంటేషన్ 15 రోజుల్లో పూర్తి చేయాలని హార్టికల్చర్ అధికారిని ఆదేశించారు.ఈ సమావేశంలో
ఇండస్ట్రియల్ జోనల్ మేనేషర్ స్వామి, కూడా చీప్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్ రెడ్డి , ట్రాన్స్ కో ఎస్ .ఇ, ఇరిగేషన్ ఎస్. ఇ., ఇ ఇ., ఎన్పీడీసీఎల్ ఎస్ ఇ.గౌతంరెడ్డి, మిషన్ భగీరథ ఈ మాణిక్యరావు,
ఆర్ అండ్ బి డి ఇ దేవిక, గీసుకొండ తహశీల్దార్ రియాజుద్దీన్, సంగెం తహసిల్దార్ రాజకుమార్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

next post