జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుకొండ మండల కేంద్రానికి చెందిన కోతి ఎల్లమ్మ అనే మహిళ అనారోగ్యంతో మృతిచెందగా, ఆమె అంత్యక్రియల సహాయార్థం గీసుకొండ గ్రామానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్లపాటి లక్ష్మీనారాయణ మానవత్వంతో స్పందించి ఐదువేల రూపాయాల నగదును గీసుకొండ సోషల్ సర్వీస్ టీం కన్వీనర్ కర్ణకంటి రాంమూర్తి, మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈకార్యక్రమంలో స్థానికులు పసుల రాజేందర్, సంపత్, నవీన్,కిశోర్, కోతి శివరాజ్ ,సుమన్,నవీన్,సాదు రాజేష్, తుప్పతుర్తి దేవేందర్,పుచ్చ మొగిలి,కంకణాల ఎల్లస్వామి, నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు .
