Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా గటిక విజయ్ కుమార్

తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం నూతన అధ్యక్షునిగా వరంగల్ జిల్లా నెక్కొండ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ గటిక విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పెరిక సంఘం సర్వసభ్య సమావేశం కోకాపేటలోని పెరిక కుల ఆత్మగౌరవ భవనంలో ఆదివారం ఘనంగా జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు డాక్టర్ విజయ్ కుమార్ ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.విజయ్ కుమార్ గతంలో తెలంగాణ సీఎం పీఆర్వోగా పనిచేయడంతోపాటు, వివిధ ఛానళ్లు, న్యూస్ పేపర్లలో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం ఐ న్యూస్ ఛానల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. పెరిక కుల ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ గా సుందరి వీర భాస్కర్ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ ముతినేని వీరయ్య, మాజీ ఎమ్మెల్యేలు శ్రీరాం భద్రయ్య, బండి పుల్లయ్య, సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు మద్దా లింగయ్య, దాసరి మల్లేశం, శ్రీరామ్ దయానంద్, నాయకులు చుంచు ఉషన్న తదితరులు పాల్గొన్నారు.

Related posts

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో జన సందేశ్ డిజిటల్ పత్రిక

Jaibharath News

మేడారం సైకిల్ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

ఓరుగల్లు నుండి ఇద్దరు మంత్రులు ప్రమాణస్వీకారం

Jaibharath News