Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

బ్యాంకు లావాదేవీల్లో అప్రమత్తం ..సెర్ప్ -డి ఆర్ డి ఏ ఏపిఎం ఈశ్వరయ్య

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
వరంగల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రంలో ప్రగతి గ్రామైక్య సంఘం స్వయం సహాయక సంఘాల మహిళలంతా రుణ,పొదుపు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని సెర్ప్ -డి ఆర్ డి ఏ ఏపిఎం ఈశ్వరయ్య మహిళలకు సూచించారు.గీసుకొండ మండలంలో సోమవారం నాడు విఓ అధ్యక్షురాలు, మండల సమైక్య కార్యదర్శి దౌడు శారద అధ్యక్షతన జరిగిన నగదు రహిత లావాదేవీల పై మహిళా సంఘ సభ్యులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. డి ఆర్ డి ఏ ఏపిఎం ఈశ్వరయ్య మాట్లాడుతూ నేటి కాలంలో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా అవసరము ప్రభుత్వ పథకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి అయితే అది లేకుండా డిజిటల్ లావాదేవీలు నిర్వహణ, బ్యాంకు ఖాతాకు ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు, కేవైసీ చేసుకొని, ఇన్సూరెన్స్ కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇతర యాప్ వినియోగించేటప్పుడు రుణ యాప్ ల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. లేకుంటే చిక్కుల్లో పడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్- డీఆర్ డిఏ సీసీ బొజ్జ సురేశ్,విఓ అధ్యక్షురాలు దౌడు మమత,చాపర్తి అనిత, సీఆర్పీలు పొగాకు రజిత, మేకల.నాగ మల్లేశ్వరి,వివోఏలు వీరగోని.జ్యోతి, కర్ణకంటి సరస్వతి,వీరగొని హేమలత, వీరగోని భవాని, మహిళా ప్రతినిధులు ఉమారాణి,సుభద్ర,నవత తదితరులు పాల్గొన్నారు.

Related posts

సఖి సేవలపై విధ్యార్థులకు అవగాహన కార్యక్రమం :

రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులు అర్పించిన “మంత్రి కొండా సురేఖ

యోగ సాధన తో సంపూర్ణ ఆరోగ్యం