Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అమరుల ఆశయాలను కొనసాగిద్దాం.

అమరుల ఆశయాలను కొనసాగిద్దాం.
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు ):
ఆత్మకూరు మండలం, గూడెప్పాడు గ్రామంలో గుండెపోటుతో అమరుడైన సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ వరంగల్ డివిజన్ కార్యదర్శి బొట్ల రాకేష్ ఆశయాలను కొనసాగిద్దామని సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు గడ్డం సదానందం, ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి పిలుపునిచ్చారు.

బుధవారం ఆత్మకూరు మండలం, గూడెప్పాడు గ్రామంలో కామ్రేడ్ బొట్ల రాకేష్ చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించి “సంతాప సభ” మాస్ లైన్ వరంగల్ డివిజన్ సహాయ కార్యదర్శి అర్షం అశోక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొట్ల రాకేష్ విద్యార్థి దశ నుండే విప్లవోద్యమంలో భాగస్వామ్యం అయ్యాడని, విప్లవ కమ్యూనిస్టు ఉద్యమంలో నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేశాడని గుర్తు చేశారు. 13 సంవత్సరాలు వివిధ విప్లవ సంస్థల్లో రహస్య దళాల్లో పనిచేసి ములుగు, భూపాలపల్లి, ఆత్మకూరు, వరంగల్ ప్రాంతాల్లోని ప్రజల్లో విప్లవ చైతన్యాన్ని రగిలించాడని అన్నారు. ప్రస్తుతం దేశంలో కుల, మతోన్మాద ఫాసిస్ట్ విధానాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలను సంఘటితం చేసి, సమ సమాజ స్థాపన కోసం విప్లవ పోరాటాలను ఉదృతం చేయాడమే కామ్రేడ్ బొట్ల రాకేష్ కు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.
ప్రజలంతా దోపిడి, పీడన, అణిచివేతలేని సమానత్వ సమాజాన్ని స్థాపించుకోవడానికి ప్రజలంతా విప్లవోద్యమం లో క్రియాశీలక భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ‌ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ ముంజల బిక్షపతి, కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బరుపట్ల కిరీటి,
సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు చిర్ర సూరి, డిబిఎస్ఎఫ్ నాయకులు రాము,పీడీఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నర్సింహరావు, ప్రజా సంఘాల నాయకులు జైపాల్ సింగ్, సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ వరంగల్ డివిజన్ నాయకులు మైదం పాణి, రమేష్, ధార లింగన్న, గట్టి కొప్పుల రవి, గనపాక సుధాకర్, హసన్ పర్తి మోహన్ ,అర్షం సుధాకర్,ఆటో యూనియన్ నాయకులు అయోధ్య,ఉద్యమ సహచారులు, కుటుంబ సభ్యులు,విప్లవాభిమానులు,ప్రజాస్వామికవాదులు పాల్గొని మాట్లాడారు.

Related posts

28న ఉచిత ధ్యాన శిక్షణ

రక్తదానం చేయండి.. ప్రమాదాలు గాయపడ్డ వారిని రక్షించండి-కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి

చదివింది ఎం.బి.ఏ చేసేది సైబర్‌ నేరాలు