Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఖానాపూర్ లో గ్రీన్ డే

(జై భారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట)పీఎస్ హెచ్ మ్ రాష్ట్ర శాఖ ప్రాతినిధ్యం మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ప్రాథమిక పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలలో నోడల్ ఆఫీసర్లుగా PS HM లను, సభ్యులుగా సీనియర్ ఎస్జీటీలను నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తూ PSHMA రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఖానాపూర్ మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలో గ్రీన్ బ్యాచ్ డే ని నిర్వహించడం జరిగింది. PSHMA వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు M.పెద్దిరాజు ఆధ్వర్యంలో ఖానాపూర్ మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాలల పిఎస్ హెచ్ఎం ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో కృతజ్ఞతా పూర్వక గ్రీన్ బ్యాడ్జీలో డే ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలో ఒక పిఎస్ హెచ్ఎంలు తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని కోరారు.అదేవిధంగా రాష్ట్రంలోని ప్రాథమిక విద్యావ్యవస్థ బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఆర్థిక కార్యదర్శి నరసింహులు మండల కన్వీనర్ జేతు రాములు , పిఎస్ హెచ్ఎం లు కే .అశోక్ వై. శ్రీధర్ స్వామి యూటీఎఫ్ మండల బాధ్యులు వి రామ్మోహన్ రావు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.

Related posts

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీఓస్ నాయకులు

Jaibharath News

సంఘ సంస్కరణ దార్శనికుడు ‘కందుకూరి’

Jaibharath News