Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

కేడల ఆన్వికి ‘‘నాట్య మయూరి’’ అవార్డు

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)
ఆలిండియా డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ లో  వరంగల్ నగరంలోని రంగశాయిపేటకు చెందిన కేడల ఆన్విని ప్రతిష్టాత్మక ‘‘నాట్య మయూరి’’ అవార్డు వరించింది. నృత్యాలయ నాటక కళా సొసైటీ, సిరి ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించిన పోటీల్లో ఆన్వి  నృత్య ప్రదర్శన ఇచ్చి నాట్య గురువుల ప్రశంసలందుకున్నారు. ఈ పోటీల్లో ఆన్వి తన నాట్య గురువు ఎ.శివకుమార్ తో పాటుగా, తన తల్లిదండ్రులు కేడల అశ్విన్- డాక్టర్ అనూషతో కలిసి ఈ అవార్డును అందుకున్నారు. ఖిలా వరంగల్ పీఏసీఎస్ ఛైర్మన్ కేడల జనార్ధన్, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ గారల మనుమరాలైన కేడల ఆన్వి ‘‘నాట్య మయూరి’’ అవార్డు అందుకున్న సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సరిత, టీచర్లతోపాటు, మున్నూరుకాపు సంఘం, ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, పలువురు కాంగ్రెస్ నాయకులు, గ్రామ  ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపి,  అభినందించారు.

Related posts

ఒక దేశం ఒక ఎన్నిక” అంశంపై  జాతీయ స్థాయిలో రెండవ బహుమతి

2050- విజ‌న్‌తో వ‌రంగ‌ల్ మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం, యుద్ధ‌ప్రాతిప‌దిక‌న వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్ట్ ప‌నులు

సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని ఉపాధ్యాయులకు మంత్రి సురేఖ శుభాకాంక్షలు