జై భారత్ వాయిస్ నూజివీడు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 28 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోనుగుండ్ల కోటేశ్వరరావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ రోజు పరిస్థితుల ప్రభావంతో ముఖ్యమంత్రి పదవిని సైతం బాధతో స్వీకరించే పరిస్థితి నెలకొంది. పార్టీని పరిరక్షించడం, రాష్ట్రాన్ని కాపాడడమే లక్ష్యంగా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు, అందుకు రాష్ట్ర ప్రజలుకూడా సహకరించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికి రాష్ట్ర బడ్జెట్ కేవలం రూ.12,500 కోట్లు మాత్రమే. ఉద్యోగులకు జీతాలివ్వడానికి, సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు ఎన్నో అవస్థలు పడాల్సి వచ్చేది తెలిపారు.
అలాంటి పరిస్థితుల్లో ఆర్ధిక సంస్కరణలు, పాలనా సంస్కరణలతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. ఐటీ పెట్టుబడులు, పారిశ్రామిక పెట్టుబడులతో రాష్ట్ర సంపదను పెంచారు. 2003-04 నాటికి రాష్ట్ర బడ్జెట్‌ను రూ.44 వేల కోట్లకు పెంచారు.
అదే సమయంలో జంటనగరాలకు తోడుగా సైబరాబాద్ అనే మూడో నగరాన్ని సృష్టించి ప్రపంచ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ ఎగుమతుల్లో ప్రత్యేక స్థానం కల్పించారు. నాడు ప్రకటించిన విజన్ 2020 నేడు సాకారమైంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం వచ్చే ఆదాయంలో దాదాపు 65శాతం సైబరాబాద్ నగరం నుండే వస్తోందంటే.. దానికి ముఖ్యకారణం నాడు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలే. ఆ ఆదాయంతోనే తెలంగాణ ప్రస్తుతం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. అదే స్ఫూర్తితో అమరావతి నగరాన్ని అభివృద్ధి చేసి నవ్యాంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేందుకు ప్రణాళికలు రూపొందించారు. కానీ జగన్ రెడ్డి అసమర్ధ నిర్ణయాలు, అస్తవ్యస్థ పాలనతో రాష్ట్రాన్ని చీకటిమయం చేశాడు. హైదరాబాద్ విషయంలో చంద్రబాబు నిర్ణయాలను తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారు. కానీ నేడు నాటి నిర్ణయాలను రద్దు చేసి, సంక్షేమం, అభివృద్ధి లేని రాష్ట్రంగా మార్చారు. అప్పుల ఊబిలోకి నెట్టారు.
అభివృద్ధి లేక, ఆదాయం లేక అవస్థలు పడుతున్న రాష్ట్రాన్ని కాపాడే శక్తి చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉంది. కావున ప్రజలంతా భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు వెంట నడవాలని కోరుతున్నా. సైకో పాలనలో ప్రజలు ప్రశాంతంగా బతకడం ప్రశ్నార్ధకమైంది. ప్రజలు తమ ఆస్తులు కాపాడుకోవాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా రావాలన్నా, రాజధాని అమరావతి పూర్తవ్వాలన్నా, పోలవరం పూర్తై రాష్ట్రం సస్యశ్యామలం కాలన్నా, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తవ్వాలన్నా చంద్రబాబు నాయుడు రావాల్సిందే. రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజలు ఎవరి హయాంలో ఏం జరిగిందో, ఎవరు వస్తే భవిష్యత్తుకు భరోసా ఉంటుందో గుర్తెరిగి అంతిమంగా మంచి నిర్ణయం తీసుకోవాలి. భావితరాల భవిష్యత్తు కోసం ప్రజలు మెరుగైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.