హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో లోని ధర్మశాలలో నవంబర్ 18 నుండి 27 వరకు నిర్వహించే జాతీయ అడ్వెంచర్ క్యాంపు కు వాలంటీర్ల ఎంపిక కాకతీయ విశ్వవిద్యాలయంలోని ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ ఎంపిక కార్యక్రమానికి విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలకు చెందిన 150 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఎంపికలో భాగంగా శరీర దృఢత్వం పరీక్షలు, రెండు కిలోమీటర్ల రన్నింగ్ తో పాటు హిందీ, ఇంగ్లీష్ లో భాష పరిజ్ఞానం పరిశీలించి ఎంపిక చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఐదుగురు అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలను ఎంపిక చేసినట్లు తెలిపారు.
previous post

