Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

తిరుమలగిరి కి చెందిన భాస్కర్ కి ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం నుండి లేఖ

(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన దూడం భాస్కర్ కి భారత ప్రధాని లేఖ  పంపించడంతో
తిరుమలగిరి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు
భారత ప్రధానమంత్రి సెప్టెంబర్ 17, న జన్మదినం పురస్కరించుకొని తిరుమల గిరి గ్రామం నుండి గ్రామస్తుల పక్షాన గ్రామ రైతు రైతు కూలీల పక్షాన గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థుల  పాఠశాల ఉపాధ్యాయ బృందం  గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుధ్య కార్మికుల పక్షాన ఆత్మకూరు మండల పోలీస్ శాఖ పక్షాన భారత ప్రధాన మంత్రి కి జన్మ దిన శుభాకాంక్షలు తెలియచేస్తూ దూడం భాస్కర్ ఉత్తరం ద్వారా సెప్టెంబర్ పదో తరికున తెలియచేయడం జరిగింది ఇందుకు గాను భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ అక్టోబర్ ఏడున ప్రత్యుత్తరం ద్వారా దూడం భాస్కర్ లేక పంపించారు లేఖలో మీలాంటి తోటి పౌరులనుండి వచ్చిన ఇటువంట్ ఆప్యాయతతో కూడిన మాటలు మన దేశానికి సేవ చేయడానికి కట్టుబడి ఉండడానికి నన్ను ప్రేరేపిస్తాయి జన్ -భాగీదారి లేదా ప్రజలభాగస్వామ్యం ద్వారా అత్యున్నత లక్ష్యాలను సాదించ్చ వచ్చు,దేశం  లక్షలాది మంది పౌరులు సమష్టి బలం తో 2047 నాటికి అభివృధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా దేశం ముందుకు సాగుతుంది ఈ సంకల్పాన్ని నెరవేర్చడంలో  ప్రతి పౌరుడి ప్రయత్నాలు అమూల్యమైనవి స్వచ్ఛత “ఎక్ పెడ్ మాకేనామ్”  టిబీ ఫ్రీ ఇండియా, చిరు ధాన్యాల వాడకాన్ని ప్రోత్సహించడం మరియు స్వస్థ్ నారి-సశక్తి పరివార్ అనేక ఉద్యమాలతో మీ నిరంతర మద్దతు  అనుబంధం బలమైన దేశాన్ని నిర్మించే ప్రయత్నాలకు కొత్త ఉత్సాహన్నీ ఇస్తాయి మనం పండగ సీజన్ లో ఉన్నాము ఈ కాలం లో జి ఎస్ టి రెట్లు కూడా తగ్గించబడ్డాయి. ప్రతి ఒక్కరు దీనినుండి ప్రయోజనం పొందుతారు షాపింగ్ చేసేటప్పుడు స్వదేశీ మంత్రాన్ని గుర్తుంచుకోవాలని నా అభ్యర్థన అది పండుగల సమయం లో అయిన లేదా ఇతర సందర్భాలలో  అయినా మన స్థానిక తయారీదారుల చేతులను బలోపేతం చేయమని స్వదేశీ మార్గంలో నడవడం ద్వార మాత్రమే స్వాలంబన భారత దేశాన్ని నిర్మించాలనే మన ప్రతిజ్ఞ నెరవేరుతుంది మీ ఆప్యాయత పూర్వక మాటలకు మరోసారి ధన్యవాదాలు మీకు మంచి ఆరోగ్యం సంపన్న జీవితం కావాలని శుభాకాంక్షలు తెలియచేస్తూ నరేంద్ర మోదీ కార్యాలయం నుంచి లేఖ వచ్చిందని భాస్కర్ తెలిపారు.

Related posts

వివాహానికి ఆర్థిక సహాయం

Jaibharath News

అత్మకూరు పాఠశాల ను ఆకస్మికంగాచేసిన కలెక్టర్ ప్రావీణ్య.-పరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం

వికారాబాద్ కలెక్టర్ మీద జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర తహశీల్దార్ల అసోసియేషన్ రాష్ట్ర నేతల ఖండన