పోలీస్ సేవలు అభినందనీయం
- ఆలయ ప్రధాన అర్చకులు ఆరుట్ల కేశవమూర్తి
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ రాములవారి బంగారు ఆభరణాల ను దొంగిలించిన దొంగలను పట్టుకొని తిరిగి అందజేసిన పోలీసులు సేవలు అభినందనీయమని ఆలయ ప్రధాన అర్చకులు ఆరుట్ల కేశవమూర్తి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం గూడెంపాడు గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఇటీవల చోరీకి పాల్పడ్డ నిందితులను పట్టుకొని వారి నుంచి బంగారు ఆభరణాలను దిక్కరిచేసి దేవాలయం కు అందించిన సీఐ ఆర్ సంతోష్, ఎస్సై తిరుపతి, ఎస్సై సతీష్, కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆలయ కమిటీ చైర్మన్ కందికొండ రఘుపతి, వైస్ చైర్మన్ పోరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు శిథిరాల శ్రీనివాస్ రెడ్డి, జనగాం సాంబయ్య గౌడ్ పోలీసులను ఘనంగా సత్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆరుట్ల కేశవమూర్తి శాలువాలతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బృందం పాల్గొన్నారు

