Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ధాన్యం కొనుగోలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)హనుమకొండ: వరి ధాన్యం కొనుగోలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు.మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలులో ఎదురయ్యే సమస్యల పై ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం మిల్లుకు చేరేవరకు పర్యవేక్షణపై ఫిర్యాదుల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు. కంట్రోల్ రూమ్ లో ఫిర్యాదుల స్వీకరణకు అధికారులకు విధులు కేటాయించినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు, లారీలు, గోనె సంచులు, కొనుగోళ్ల ప్రక్రియ మానిటరింగ్, తదితర సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ నెంబరు 7330751364 ను సంప్రదించవచ్చునని కలెక్టర్ సూచించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సంబంధిత అంశాలపై ఫిర్యాదుల కోసం ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ సేవలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, పౌరసరఫరాల శాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సర్పంచ్ ను అభినందించిన హన్మకొండ కలెక్టర్

Jaibharath News

అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఆత్మకూరు -సిఐ క్రాంతి కుమార్

Jaibharath News

అందని ద్రాక్షగా మారిన ఇంటర్మీడియట్ మధ్యాహ్న భోజన పథకం