( జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు. తెలంగాణ రాష్ట్రంలో మినీ మేడారం గా పేరు గాంచిన ఆత్మకూరు మండలం అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు సౌకర్యాలు విస్తృతంగా కల్పిస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. అగ్రంపహాడు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.మంగళవారం ఆత్మకూరు మండలం అగ్రంపాడు గ్రామంలోని సమ్మక్క గద్దెల వద్ద సమావేశం నిర్వహించారు .అంతకముందు సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… జాతర సమయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అన్నారు.అమ్మవార్లని గద్దెల మీదికి తీసుకవచ్చే సందర్భములో జాతరలో ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరుగకుండా శాంతి భద్రతల పర్యవేక్షణ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.త్రాగునీరు, క్లోరినేషన్ చేయుట,108 వాహనం అదుబాటులో ఉంచుట,వైద్యులు అందుబాటులో ఉండాలని అన్నారు.భక్తుల వాహనాలు పార్కింగ్ చేయుటకు స్థలం, చలవ పందిళ్ళు,క్యూలైన్స్, భోజన సౌకర్యం,మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయటం తదితర అంశాలపై చర్చించారు.చేతి పంపులు మరియు బోర్వెల్స్ రిపేర్, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు, రోడ్ల పక్కన చెట్లను తొలిగించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.భక్తుల సౌకర్యార్థం త్రాగు నీరు ఏర్పాటు చేయడందేవాలయ జాతర ప్రాంగణము, వాహనాలు పార్కింగ్ స్థలములలో లైటింగ్ ఏర్పాటు మరియు అమ్మవార్ల గద్దెల చుట్టూ లైటింగ్ డెకరేషన్ ఏర్పాటు చేయటం నిరంతర విధ్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ పి నారాయణ, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సునీత,ఈవో నాగేశ్వరరావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.


