(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)
మొంథా తుఫాన్ ఓ కుటుంబం లో విషాదం నింపింది.
మొంథాతుఫాన్ ప్రభావం వల్ల వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురవడంతో వరద నీటిలో కొట్టుకుపోయి యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటన శివనగర్ మైసమ్మ నగర్ లో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి ఖమ్మం హైవే పై ప్రవహిస్తున్నటువంటి వరదనీటిని దాటే క్రమంలో గీసుకొండ మండలం రాంపురం గ్రామపంచాయతీ పరిధిలోని గట్టుకిందపల్లికి చెందిన పులి అనిల్ (35) తన బైక్ తో సహా గల్లంతయ్యాడు.24 గంటలు గడిచిన తర్వాత అనిల్ మృతదేహం దొరకడంతో కుటుంబ సభ్యులు దుఃఖ సముద్రంలో ఉన్నారు.శవ పరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చురీకి మృతదేహాన్ని తరలించిన పోలీసులు
previous post
next post

