(జై భారత్ వాయిస్ న్యూస్ పరకాల )
మొంథా తుఫాన్ ప్రభావంతో రైతు నష్టపోయిన పంట నష్టంను అంచనా వేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. పరకాల నియోజకవర్గంలో గురువారం నడికుడా మండలం ముస్తాలపల్లి, దామెర మండలం పసరగొండ క్రాస్ వద్ద, ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామంలో మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి,పత్తి పంటలనుఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంట నష్టానికి గల కారణాలను రైతుల నుండి అడిగి తెలుసుకున్నారు.నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని,సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టితో ప్రతి రైతు యొక్క నష్టపోయిన పంట నష్టంను అంచనా వేయాలని ఆదేశించారు. రైతులు ఆరుగాలం కష్టించి రైతు సాగు చేసి, పండించిన పంట చేతికి వచ్చే దశలో రైతులు నష్టపోయి మొంథా తుఫాన్ ప్రభావంతో బాధపడుతున్నారని, నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.



