(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు తనయుడు నారా రోహిత్, శిరీషల వివాహ వేడుక గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. నూతన వధూవరులకు నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేశారు. ఈ వివాహ కార్యక్రమానికి రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు మా రోహిత్ ఒక ఇంటివాడు అవుతున్న శుభ సందర్భం మా కుటుంబానికి ఒక పండుగ. మా నారావారి ఆహ్వానం మన్నించి పెళ్లికి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు





