(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):
హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఆత్మకూరు మండలం అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతర సమీపంలోని జి ఎస్ ఆర్ గార్డెన్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ రవీంద్ర ఉత్తంరావు దాల్వి హాజరయ్యారు. ముందుగా పరకాల నియోజకవర్గం ఇంచార్జ్ ఇనుగాల వెంకటరామిరెడ్డి సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు. ఆత్మకూరు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కమలాపూర్ రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమావేశానికి హాజరైన ఇనగాల వర్గీయులు, కొండా మురళీధర్ రావు వర్గీయులు మధ్యన పరకాల కాంగ్రెస్ టికెట్ నాదంటే నాదని అంటూ ఇనాగాల వర్గీయులు తమ నాయకుని పేరు చెపుతూపెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సమావేశం రసాభాసగా మారి గందరగోళ పరిస్థితి నెలకొంది. రానున్న శాసనసభ ఎన్నికల్లో అంచరించాల్సిన వ్యూహం పార్టీ ఇచ్చే టికెట్ల పైన సమావేశంలో కార్యకర్తలతో చర్చ జరగాల్సి ఉండగా వర్గాల పోరుతో రసా భాస గా మారిపోయింది. కార్యక్రమానికి వచ్చిన రవీంద్ర ఉత్తమ్ రావు దాల్వి సమావేశంలో మాట్లాడకుండానే వేను దీరగాల్సి వచ్చింది . ఈ సందర్భంగా ఎన్నికల వెంకట్రాంరెడ్డి కార్యకర్తల మధ్యన కారెక్కి పరకాల నియోజకవర్గం టికెట్ తనదే నంటూ తొడగొట్టి ఎవడు వస్తాడో రండి అంటూ సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే కొండా మురళీధర్ రావు తన వర్గీయుల మధ్యన మీసం మేలేసి పరకాల టికెట్ తనదేనంటూసవాల్ విసిరారు.దీంతో కార్యకర్తలు సమావేశం హాజరైన ముఖ్య నాయకులు నాయకులు అయోమయానికి గురయ్యారు. పోటాపోటీగా తమ నాయకునికి అనుకూలంగా నినాదాలు చేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ సమావేశానికి హనుమకొండ వరంగల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, దొమ్మటి సాంబయ్య, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పరకాల నియోజకవర్గం లోని అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వివిధ అనుబంధాల సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
next post