Jaibharathvoice.com | Telugu News App In Telangana
కృష్ణా

అవినీతిపై పోరాటానిక ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి*

(జై భారత్ వాయిస్ న్యూస్ విజయవాడ)
మన సమాజ అభివృద్ధికి అవినీతి అవరోధంగా ఉందని దాన్ని పారదోలాల్సిన అవసరం ఉందని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ అన్నారు.. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ -2025 లో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం ఉదయం సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున అవినీతికి వ్యతిరేకంగా విజిలెన్స్ అవేర్ నెస్ వీక్ ను చేపట్టడం జరుగుతుందన్నారు.  నవంబర్ రెండో తారీకు వరకు దీనిపై ప్రజల్లో దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తారన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీని చేపట్టామన్నారు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి లలో కూడా సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు.అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి అడ్డుగోడగా ఉన్న అవినీతిని పారదోలాల్సి ఉందన్నారు. అవినీతి అనేది రెండువైపులా అంటే ఇచ్చే వారు పుచ్చుకునే వారిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఏదైనా అవినీతిపై మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే 1064 కు కాల్ చేయవచ్చాన్నారు. దీనిపై వెంటనే అవినీతి నిరోధక శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు.. అవినీతిపై పోరాటంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి మనకి చాలా సపోర్టు ఉందని తెలిపారు.. ఉదయమే సైకిల్ ర్యాలీలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ బెంజ్ సర్కిల్ బందరు రోడ్డు మీదుగా పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం కు చేరుకుంది. సైకిల్ ర్యాలీలో ఎసిబి డైరెక్టర్ శ్రీమతి ఆర్. జయ లక్ష్మి, హెడ్ క్వార్టర్స్ అడిషనల్ ఎస్సీ సుధాకర్,  అడిషనల్ ఎస్సీలు మహేందర్, దిలీప్ కిరణ్, ఏసీబీ అధికారులు, యువత పాల్గొన్నారు.

Related posts

వైద్య కళాశాలల్లో  29మంది   అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్ర సచివాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ణ

Jaibharath News

ఏపీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఖరారు.‌

Jaibharath News