Jaibharathvoice.com | Telugu News App In Telangana
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

మణుగూరు కోర్టు లో ఫ్రీ లోక్ అదాలత్

జై భారత్ వాయిస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కోర్ట్ ఆవరణలో జడ్జి ఎం .వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఫ్రీ లోక్ అదాలత్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలను అనుసరించి,  న్యాయ సేవాధికార సంస్థ, 09నశనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ ను కోర్టులో నిర్వహించడానికి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని జడ్జి ఎం .వెంకటేశ్వర్లు
తెలిపారు.కక్షిదారులు తమ వీలును బట్టి తమ కేసులను 02న నుండి 09న రోజు సాయంత్రం 5.00గంటల లోపు ఏ రోజైనా రాజీ కుదుర్చుకునేలా ప్రీ-లోక్ అదాలత్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రీ-లోక్ అదాలత్ లో రాజీపడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ, కన్సూమర్ ఫోరమ్ కేసులు, ట్రాఫిక్ ఈ-ఛాలన్ కేసులు మరియు ప్రీ- లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీపడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలుపారు. ఈ ప్రీ-జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరు అయ్యి, తమ తమ కేసులను వారికి వీలయిన రోజునే పరిష్కరించుకునేలా అవకాశం కల్పిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలోమణుగూరు బార్ ప్రెసిడెంట్ మేదర మెట్ల శ్రీనివాస్ జాయింట్ సెక్రెటరీ అంకం సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Related posts

అంకం యశో మాధురి ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు