ఇస్రో ఖాతాలో మరో అద్భుత విజయం సాధించింది
LVM3-M5 ప్రయోగం విజయవంతమైంది భారత్ ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో ఇదే అతిపెద్ద ఉపగ్రహం.ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు అభినందనలు.భారతదేశం శాస్త్ర సాంకేతిక పెంపొందించుకొని ప్రపంచ దేశాల సరసన నిలుస్తుంది నవంబర్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అత్యంత బరువైన సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. భారత గడ్డపై నుంచి పంపిన ఉపగ్రహాల్లో ఇదే అతిపెద్దది. LVM3-M5 మిషన్‌లో భాగంగా CMS-03 సమాచార ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి LVM3-M5 అనే బాహుబలి రాకెట్ ద్వారా అంతరిక్ష కక్ష్యలోకి 4వేల 410 కిలోల ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఈ ప్రయోగాన్ని వందలమంది పాఠశాల పిల్లలు లైవ్‌లో వీక్షించారు. ఈ ప్రయోగానికి నిన్న సాయంత్రం ఐదు గంటలా 26 నిమిషాలకు కౌంటింగ్ మొదలైంది. కౌంట్‌డౌన్ సజావుగా సాగడంతో ఇస్రో లాంఛింగ్ ప్రక్రియను పూర్తిచేసింది.



