జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం
Telangana cm revanth reddy
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి, ప్రస్తుతం కొనసాగుతున్న డేటా సెంటర్ ప్రాజెక్టులు, తెలంగాణలో AWS విస్తరణ ప్రణాళికలపై చర్చలు జరిపింది.ఈ ప్రతినిధి బృందంలో కెర్రీ పర్సన్, వైస్ ప్రెసిడెంట్ (AWS గ్లోబల్ ఆపరేషన్స్ అండ్ డేటా సెంటర్ డెలివరీ); విక్రమ్ శ్రీధరన్, డైరెక్టర్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ పాలసీ, AWS); అనురాగ్ ఖిల్నాని, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ డెలివరీ) తదితర సీనియర్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడులు, విస్తరణ కార్యక్రమాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
previous post

