(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు ):మినీ మేడారం గా ప్రసిద్ధిగాంచిన ఆత్మకూరు మండలం అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతరలో వేలం పాటలను గురువారం ఎండోమెంట్ సహాయ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరి ముక్కలను పోగు చేసుకునేందుకు వేలం పాట గత జాతరలో 78,216 రూపాయలు కాగా ఈ జాతరలో రూ. 2.15 లక్షలకు పాట తీసుకోవడం జరిగింది. అలాగే పుట్టు వెంట్రుకలు ప్రోగు చేసుకునే హక్కు గత జాతరలో 1,35000 రూపాయలు కాగా ఈ జాతరలో రూ 1.50 లక్షలకు వేలం పాట పోయింది. అలాగే సైకిల్ స్టాండ్ హక్కు కోసం గత జాతరలో ఒక లక్ష 71,000 రూపాయలు కాగా ఈసారి జాతరకు రూ 3.23 లక్షలకు పాటకు దక్కింది. అలాగే పేలాలు పుట్నాలు అమ్ముకోవడానికి గత జాతరలో 5500 పాట కాగా ఈసారి జాతరకు 6100 రూపాయలకు ఖరారు జరిగింది. మొత్తం నాలుగు వేలం పాటలకు ఈసారి వేలం పాటల్లో 6 లక్షల 94,100 రూపాయలకు ఖరారయ్యాయి. గత జాతర కంటే మూడు లక్షల 4 వేల 384 రూపాయల ఆదాయం అదనంగా చేకూరిందని జాతర ఈవో అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు. బెల్లం కొబ్బరికాయలు అమ్ముకునే హక్కు, లడ్డు పులిహోర అమ్ముకునే హక్కు కోసం జరిగిన వేలం పాటల్లో ఎవరు పాల్గొనకపోవడంతో వాయిదా వేసామని తిరిగి ఈనెల 25వ తేదీన వేలంపాట నిర్వహిస్తామని ఈవో తెలిపారు. వేలం పాటలకు వరంగల్ డివిజన్ పరిశీలకులు డి అనిల్ కుమార్, ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి మాజీ చైర్మన్ బోరిగం స్వామి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఏలియా, జాతర పూజారులు గోనెల సారంగపాణి, గుల్లెపల్లి సాంబశివరావు, గోనెల రవీందర్ గ్రామస్తులు పాల్గొన్నారు.


