(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)సహకార సంఘాలు బలంగా ఉంటేనే రైతులు ఆనందంగా ఉంటారని, ప్రభుత్వ సహకార సంఘాలు బలోపేతం చేసుకోవాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.ఆత్మకూరు మండలం పెంచికలపేట పిఎసిఎస్ ఆధ్వర్యంలో నీరుకుల్ల గ్రామంలోని కందిబండ వద్ద ధాన్యం సేకరణ డ్రై షెడ్ కు భూమి పూజ,ఫర్టిలైజర్ గోదాం డ్రై షెడ్ కార్యాలయమునకు భూమి పూజ చేశారు. నీరు కుళ్ళ గ్రామంలో 72వ అఖిలభారత సహకార వారోత్సవాల సందర్భంగా పిఎసిఎస్ పెంచికల పేట నూతన భవనం ప్రారంభోత్సవం (నీరుకుళ్ళ లో) టీ క్యాబ్ చైర్మన్ శ్రీ మార్నేని రవీందర్ రావు గారితో కలిసి పరకాల శాసనసభ్యులురేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.అనంతరం ఏర్పాటుచేసిన 72వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా జెండాను ఆవిష్కరించి, ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…. మనకు మనం అభివృద్ధి చేసుకునే వ్యవస్థ సహకార వ్యవస్థ అని, వ్యవసాయ రంగానికి సహకార వ్యవస్థ చాలా అవసరం అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి వ్యవసాయంపై ఆధారపడి ఉందని, సహకార వ్యవస్థ ద్వారానే అభివృద్ధి సాధ్యం అని అన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు, బ్యాంకింగ్, తదితర సేవలు అందిస్తున్నారన్నారు. ఇదే పూర్తిగా తీసుకొని డ్వాక్రా గ్రూపులను చేయించి ప్రోత్సహించి, మహిళా బ్యాంకులు, మహిళా సాధికార లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. మహిళల ఆర్థిక వ్యవస్థ పరకాల మహిళా డైరీ ఏర్పాటుకు కృషి చేస్తుందని, రైతు కుటుంబాలు గౌరవంగా ఉండాలంటే, సహకార సంఘాలు బలోపేతం కావలసి ఉందన్నారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందించడం, రైతులకు సాగు విధానం, ఆధునిక వ్యవసాయం, తదితరా అంశాలకు సహకార సంఘాలు తోడ్పడతాయన్నారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకోవాలని, సకాలంలో పెంచికలపేట పిఎసిఎస్ భవనాన్ని పూర్తిచేసి, రైతులకు ఉపయోగపడేలా కృషి చేసినందుకు పాలకవర్గాన్ని అభినందించారు. అభివృద్ధిలో రాజకీయాల్లో వద్దు అని, పనిచేసే వారికి రాజకీయాలకతీతంగా ప్రోత్సహిస్తాను అన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. చేస్తున్న ప్రతి పనికి అధికారుల సహకారం ఉండడం వలనే ముందుకు పోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డి సి ఓ సంజీవరెడ్డి, నాబార్డ్ డిడిఎం చంద్రశేఖర్, డీసీసీబీ సీఈవో వజీర్ సుల్తాన్, పెంచికలపేట పి ఏ సి ఎస్ చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
previous post

