(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు);
గ్రామీణ క్రీడాకారులు కబడ్డీ క్రీడలలో జాతీయ స్థాయికి ఎదిగి రాణించాలని ఆత్మకూరు పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్ అన్నారు ఆత్మకూరులో జరిగిన జోన్ కబడ్డీ సెలక్షన్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఆత్మకూరు కబడ్డీ అసోసియేషన్అధ్యక్షుడు బరుపట్ల కిరీటి ఆధ్వర్యంలో ఆత్మకూరు లో జోన్ కబడ్డీ సెలక్షన్స్ విజయవంతమైనవని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాసన్ పర్తి అధ్యక్షుడు జోన్ గడ్డం రమేష్ గౌడ్ ,జోన్ సెక్రటరీ శ్రీనివాస్ ,వాగ్దేవి కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ కిషన్, ఆత్మకూరు మండల సెక్రటరీ కీత అనిల్ కుమార్, మండల ఉపాధ్యక్షులు సంగల రాజు, సెయింట్ థెరీసా స్కూల్ పిటి శ్రీకాంత్, మండల నాయకులు సంగే మహేందర్, మండల యూత్ కార్యదర్శి కరీం బయ్యా రవికుమార్, దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొనగా ఆత్మకూర్,దామెర, శాయంపేట మండలాలు బాల బాలికలు పాల్గొన్నారు. ఈ సెలక్షన్స్ లో 140 క్రీడాకారులు పాల్గొనగా, 20 మంది బాలబాలికలు జిల్లా స్థాయికి ఎంపికైనా రని నిర్వాహకులు తెలిపారు.

