Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

వరంగల్ డిసిసి అధ్యక్షుడు  మొహమ్మద్ అయూబ్ కు సన్మానం

(జై భారత్ వాయిస్ న్యూస్ రంగశాయిపేట)
కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా  అధ్యక్షులు గా  నూతనంగా నియామకమైన మొహమ్మద్ అయూబ్ ను గ్రేటర్ వరంగల్ రంగశాయిపేట 42వ డివిజన్  కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖిలా వరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు కేడల జనార్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వరంగల్ తూర్పు నుండి కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తగా మొదటి నుండి పార్టీ శ్రమించి కష్టపడి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన ఫలితంగా పార్టీ గుర్తించి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ కి రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు కి ప్రత్యేకమైన  కృతజ్ఞతలు తెలిపారు

ఈ సన్మాన కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కేడల జనార్దన్  మాజీ కార్పొరేటర్ కేడల పద్మ 42 వ డివిజన్ మాజీ డివిజన్ అధ్యక్షులు కర్ర కుమార్, డివిజన్ నాయకులు దామరకొండ కర్ణాకర్, కలకోట్ల రమేష్, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు  కానుగంటి పద్మావతి, బక్కి కల్పనా, అంబటి రమ, వనం లావణ్య, నేరెళ్ల అరుణ, అడుప లలిత, చిట్ల హేమలత, కందగట్ల మమత, ఉప్పునూతల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాంచాల రాయలస్వామిని దర్శించుకున్నా బీజేపీ నేతలు

Jaibharath News

ఆడపిల్లలు ఉన్నత విద్యను పొందితేనే హక్కులు సమానవత్వం సాధ్యం.

కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం లో హనుమాన్ చాలీసా పారాయణం