Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మహిళలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలువాలన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యం

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుగొండ మండలంలోని కొనయామకుల రైతు వేదికలో మండల పరిధిలోని మహిళలకు జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి  ఆదివారంఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు నాణ్యమైన చీరలు అందిస్తున్నామని, మన ప్రభుత్వంలో పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు.మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటుగా,రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు.రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు.గత ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలలో చేయలేని పనులు గుర్తుంచుకొని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అన్నారు. చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అంచేలంచలుగా నెరవేరుస్తుందని బిఆర్ఎస్ గత ప్రతి సంవత్సరాల పాలనలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని, అభివృద్ధి ముసుగులో దోచుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మొదటగా ఉచిత బస్సు సౌకర్యం ప్రయాణాన్ని కల్పించిందని అన్నారు.పరకాల మహిళా డైరీ మహిళల భవిష్యత్ నిర్మాణానికి పునాదిగా నిలవాలి  అని, మహిళా శక్తి ఉప్పనల ముందుకు సాగాలని అన్నారు.మహిళలకు సాంఘిక చైతన్యం, పొదుపు అలవాటు చేసి,ఆర్థిక  పరిస్థితికి మహిళ సమస్యలు ఉపయోగపడతాయని తెలిపారు.అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి సమన్వయంతో కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనంతరం ఊకల్ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి హాజరైనారు.

Related posts

వరంగల్ లో 14న నిరసన దీక్ష:- బిజెపివరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్

ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

సీఎం కప్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయండి: నగర మేయర్ గుండు సుధారాణి