న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి కి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి పదవీ కాలం విశిష్టంగా, ప్రభావవంతంగా సాగాలని ఆకాంక్షించారు.


