జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)
ప్రభుత్వ ఉద్యోగ, పెన్షనర్ ల సమస్యలను పరిష్కరించాలని టీ యన్ జి ఓస్ యూనియన్ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీ న సాయంత్రం నాలుగు గంటలకు హన్మకొండ అంబేడ్కర్ భవన్ లో నిర్వహించే సభను విజయవంతం చేయాలని టి యన్ జి ఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఉద్యోగులను కోరారు.ఈసభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏం డి ముజిబ్ హుస్సేన్ లతో పాటు 33 జిల్లాల అధ్యక్షు, కార్యదర్శి లు హాజరవుతున్నారని, ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యల పరిష్కారానికి ఈ సభ వేదికగా మారుతుందని అన్నారు.ఈ సమావేశంను జిల్లా ఉద్యోగులు, పెన్షనర్ లు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు , అంగన్వాడీ ఉద్యోగులు, పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేసి మన సమస్యలను పరిష్కరించూకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ మన ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యోగుల ఐక్యతను చాటి మన ఉద్యమ స్పూర్తి మిగితా జిల్లాలకు ఆదర్శంగా ఉండి మన సమస్యలను సాధించుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కార్యదర్శి గాజె వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, సహ అధ్యక్షులు హేమ నాయక్, ఉపాధ్యక్షులు దుర్గారావు, జి రాజు, రమాదేవి, సిటీ అధ్యక్షులు శెంకేషి రాజేశ్, తాలుకా యూనిట్ అధ్యక్ష కార్యదర్శిలు, వివిధ శాఖల నాయకులు పాల్గొని ఉద్యోగుల సాధన సభ పోస్టర్ ఆవిష్కరించారు.
next post

