Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పైకి రావాలని, తద్వారా విద్య ద్వారానే సమాజంలో గౌరవం లభిస్తుందని లయన్స్ క్లబ్ ఆత్మకూరు శాఖ అధ్యక్షులు ఏరుకొండ రవీందర్ గౌడ్ అన్నారు .శనివారం ఎంపీపీఎస్ ఆత్మకూరు పాఠశాలలో పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ వారిచే బెల్టులు, బ్యాడ్జెస్, టైలు మరియు క్లాత్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెండెం రాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ ఆత్మకూరు అధ్యక్షులు ఏర్కొండ రవీందర్ గౌడ్ ,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి నిర్మల కుమారి పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఏరుకొండ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు , చదివించలేని నిరుపేదలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నామని అన్నారు. విద్యార్థులు చదువు మధ్యలో మానివేయకుండా ఉన్నత చదువులు చదవాలని పేదరికం అడ్డు కాకూడదని అన్నారు. మరో ముఖ్య అతిథి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మల కుమారి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా బెల్టులు, టైలు ,బ్యాడ్జెస్ పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు .ప్రభుత్వ పాఠశాలలో అనేక వసతులు ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో అనేక వసతులు ఉన్నాయని ,శిక్షణ పొందిన నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల పని చేస్తున్నారని, విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చాప్టర్ ప్రెసిడెంట్ ,మాజీ జెడ్పిటిసి సత్యనారాయణ ,మా స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి నాగబండి శివప్రసాద్ ,లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు దేవేందర్ రెడ్డి ,సీనియర్ పాత్రికేయులు రాజేష్ కుమార్ పాఠశాల ఉపాధ్యాయులు నరసింహ స్వామి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Related posts

వెంటిలేటరు మీద చికిత్స లో తెలంగాణ ఉద్యమకారుడు-ఆదుకోవాలని కుటుంబ సభ్యుల వినతి

బిజెపి పార్టీ పరకాల అసెంబ్లీ బరిలో వీసం రమణా రెడ్డి

Jaibharath News

ఏలాంటి ఆపద సమయాల్లోనైనా కొండా దంపతుల ఇంటి తలుపులు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి