(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రతి గ్రామానికి నాణ్యతమైన సిసి రోడ్, సైడ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే గ్రామాలకు నిజమైన అభివృద్ధి మహర్దశను చేరుకుంటుందని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు అభివృద్ధి పేరుతో దోచుకున్నారని,ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పరకాల డైరీ ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ చీరల పంపిణీ,200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు బీమా, సన్న వడ్లకు రూ 500 బోనస్, మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ, వడ్డీ లేని రుణాలు, శ్రీనిధి రుణాలు, ఇందిరమ్మ ఇల్లు, సీఎంఆర్ఎఫ్ ,కళ్యాణ లక్ష్మి, తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

