Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

తరలిరండి – ఉజ్వల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాలుపంచుకోండి

(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)
“తరలిరండి – ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి..” అన్న నినాదంతో ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచంలో పేరొందిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్ సిటీ (Bharath Future City) లో జరగనున్న ఈ సదస్సు  నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించిన  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. ఇందుకోసం దేశ విదేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ గారు,  ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్ గారు, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా గారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవుతున్నట్టు ఇప్పటికే సమాచారం పంపించారు.UAE రాజవంశానికి చెందిన, ఎమిరేట్స్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్స్ డైరెక్టర్ షేఖ్ తారిక్ బిన్ ఫైజల్ అల్ ఖసిమి, రస్ అల్ ఖైమా (RasAlKhaimah) ప్రతినిధులు, డుయిష్ బోర్సే (Deutsche Börse) గ్రూప్ హెడ్ లుడ్విగ్ హింజెల్మన్ (Ludwig Heinzelmann) గారు , ఎన్రిషన్ (Enrission) వ్యవస్థాపక భాగస్వామి విన్స్టన్ (Winston) గారు, మాండయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ (Mandai WildLife) గ్రూప్ సీఈఓ బెన్నెట్ నియో ( Bennett Neo) గారితో పాటు పలు టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ సదస్సులో పాల్గొనడానికి ఇప్పటికే సంసిద్ధతను తెలియజేశారు. ‘2047 నాటికి వికసిత్ భారత్ – జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనిక పత్రం తయారు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు తెలంగాణకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది.ఈ లక్ష్యాలను.. ప్రభుత్వం సంకల్పాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 (Telangana Rising Global Summit 2025) ను నిర్వహిస్తున్నాం. తప్పకుండా తరలిరండి..’ అని ముఖ్యమంత్రి గారి పేరిట సందేశంతో ఆహ్వాన లేఖలు పంపించారు.
తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించడం, పెట్టుబడులకు గమ్యస్థానంగా రూపొందిన ఇక్కడి వాతావరణం, విధానాలు, స్పష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర అభివృద్ధి సాధన అంశాలను ఈ వేదికగా చాటి చెప్పాలని ప్రభుత్వం సంకల్పించింది.లియోనెల్ మెస్సీ.. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి  ఆవిష్కరిస్తారు.
తర్వాత ఈనెల 13న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) లయనెల్ మెస్సీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన పాల్గొనే వేడుకలోనే ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌ నిర్వహిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా నిలువనుంది.

Related posts

బంధుమిత్రుల కలయికతో మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు తెలంగాణ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి

GTA VC Download link by jaibharath voice

దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసి తీసుకువస్తాం సిఎం రేవంత్ రెడ్డి