జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)
వరంగల్ మహా నగరంలోని శంభునిపేట కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం లో శనివారం సాయంత్రం హనుమాన్ భక్తులు, స్వామి అయ్యప్ప భక్తులచే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.హనుమాన్ గురు స్వామి ఆకుతోట బాల కొమురెల్లి మాటేటి సత్యనారాయణ (సత్యం) కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం కమిటీ ప్రతినిధి శ్రీమాన్ శ్రీ రామదూత భజన మండలి ఆధ్వర్యంలో 51వ హనుమాన్ చాలీసా నారాయణ కార్యక్రమం దేవాలయంలో భక్తి శ్రద్ధలతో 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవాలయ పరిసరాలు భజనలచే హనుమాన్ స్మరణలు మారుమోగింది. అర్చకులు నందు బాబు స్వామివారికి వివిధ రకాల పుష్పాలతోప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామిలు,పిల్లలు పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించి అనుగ్రహం ఆశీస్సులు పొందారు.

