Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

తెలంగాణ ఆత్మను మేల్కొలిపిన వ్యక్తి అందెశ్రీ

(Jaibharathvoice news Kakatiya University)
Andesri is the person who awakened the soul of Telanganaతెలంగాణ ఆత్మను మేల్కొలిపిన వ్యక్తి అందెశ్రీ” అని కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్  ఆచార్య ప్రతాప్ రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం సెనేట్ హాల్‌లో, కాకతీయ విశ్వవిద్యాలయ విశ్రాంత అధ్యాపకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఆచార్య అజ్మీరా సీతారం నాయక్ అద్యక్షతన, “తెలంగాణ సాహిత్య సమరయోధుడు,Telangana literary warrior and state lyricist Andesri Yadi రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ యాది” లో నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఒక నిమిషం మౌనం పాటిస్తూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఅందెశ్రీ మాట, పాట ప్రకృతికి అత్యంత దగ్గరగా ఉంటాయని అన్నారు. తన కవిత్వం ద్వారా తెలంగాణ ఆత్మను మేల్కొలిపిన మహనీయుడు అందెశ్రీ అని, ఆయన రచనలు ఎల్లప్పుడూ సజీవంగా నిలిచిపోతాయని ప్రశంసించారు. ఆయన గీతాలు ప్రజలను ప్రేరణతో నింపాయని పేర్కొన్నారు.  ల్యాబ్‌లో ప్రయోగం ఎంత ముఖ్యమో, పొలంలో విత్తనం అంతే ముఖ్యమని ఉదాహరణగా చెబుతూ, పుస్తకాలు చదవడంతో పాటు పల్లె ముఖాలు కూడా చదవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన అందెశ్రీ రచనలు సమకాలీన మానవ సంక్షోభాలకు అద్దం పట్టాయి అని  అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన గీతాలు ప్రజల్లో అపార చైతన్యం రగిలించాయని గుర్తుచేశారు. ఇది బొమ్మెర  పోతన bommera pothana కాళోజి, నేరెళ్ల వేణుమాధవ్ neralla venumadhav వంటి మహనీయులను స్మరించుకునే గొప్ప నెల అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఆచార్యులు ఆచార్య  వెంకటనారాయణ, ఆచార్య  సురేష్ లాల్, విఎస్. రెడ్డి,లింగయ్య, చిర్రా రాజు, చారి, ముచ్చెర్ల పృథ్వీ రాజు, పొట్లపల్లి శ్రీనివాస్, జయరాజ్‌తో పాటు అందెశ్రీ కుటుంబ సభ్యులు Dattu sai, Mallu bai,  పాల్గొన్నారు

Related posts

DSC(SGT)పోటీ పరీక్షకు ఉచిత శిక్షణ

Jaibharath News

8 నుంచి ఊరుగొండ ‌‌లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణోత్సవాలు,జాతర

Jaibharath News

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన బొల్లోనిపల్లి ఉప సర్పంచ్ బొల్లి కనుకయ్య

Jaibharath News