Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఖానాపూర్ లో ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

(జై భారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట ).
నర్సంపేట డివిజన్ లోని ఖానాపూర్ మండల విద్యా వనరుల కేంద్రం లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా జరిగింది. గురువారం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో నీ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు వారి తల్లిదండ్రులు దివ్యాంగుల దినోత్సవానికి వచ్చి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపిడిఓ అద్వైత, ఖానాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ రఘుపతి , ఎంఈఓ శ్రీదేవి, కాంప్లెక్స్ హెచ్ ఎం కుమారస్వామి లు హాజరై చేతుల మీదుగా బహుమతులు అందించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాది అన్నారు .జ్ఞానంతో ముందుకు సాగాలని చెప్పారు.విద్యార్థులు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని చెప్పారు . విద్యార్థుల ఎదుగుదల కు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో, ఉపాధ్యాయులు రాజకుమార్ , రవి , ఈర్యా, ఐ ఈ ఆర్ పి లు పి.మహేందర్ రజనీ ఎం ఐ ఎస్ రాజేందర్, సి ఓ శశిధర్ సీ ఆర్ పి లు భాస్కర్ రమేష్ శ్రీను మెసెంజర్ జ్యోత్స్న తో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related posts

భగవద్గీత పోటీలలో గీసుకొండ విద్యార్థులు ప్రతిభ

వరంగల్ లో ప్రశాంతంగా పాలీసెట్ – 2024 పరీక్ష

Jaibharath News

జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవాలు ప్రారంభం